16, ఫిబ్రవరి 2011, బుధవారం

ఏక్ మినిట్!! అబ్బా తమ్ముడూ!!

ఈ బ్లాగ్ ఇలా "అలా మొదలైంది" సినిమా కి సంబందించిన పోస్ట్ తో మొదలు పెడుతున్నందుకు చాలా హ్యాప్పీస్.  ఇప్పటికే ఈ సినిమా మీలో చాలా మంది చూసి ఉంటారు. లేదంటే తప్పక చూసేయండి మిస్ అవకూడని ఒక మంచి సినిమా అలా మొదలైంది. ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన ఒక పాత్ర గురించి పరిచయం చేద్దామని ఈ పోస్ట్.

ఐస్ ఏజ్ సినిమా చూసిన వారికి అందులోని ఉడుత గుర్తుండే ఉంటుంది. దాన్ని Scrat ("saber-toothed squirrel") అంటారు Scrat is obsessed with acorns, constantly putting his life in danger to obtain and defend them. ఆ ప్రాసెస్ లో దాని లైఫ్ ని ఇతరుల లైఫ్ ని నానా కష్టాలలో పడేస్తుంది విపత్తులను సృష్టిస్తుంది. అలామొదలైందిలో మన గౌతం కూడా సరిగ్గా అలాంటి పాత్రే... ఇతను ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రిసెషన్ లో జాబ్ పోయిందిట ఏ పనైనా చేయడానికి సిద్దం కానీ పెళ్ళి ఇంట్లోకి వెళ్తే తాగున్నాడని ఎవరూ లెక్కచేయడంలేదు ఏదో పని ఇప్పించండి తమ్ముడూ అని తిరుగుతుంటాడు అలాంటివాడికి పెళ్ళికూతురిని కిడ్నాప్ చేయాలన్న ఐడియా వినపడుతుంది. ఇక మనవాడు ఆ మాట పట్టుకుని సినిమా క్లైమాక్స్ లొ చెడుగుడు ఆడేసుకున్నాడు. ఈ సినిమా చివర్లో ఇతని ద్వారా సృష్టించిన హాస్యం చాలా నవ్వించింది. ఒక తాగుబోతు పాత్రలో జీవించాడు.


నిజానికి నాకు సినిమాల్లో తాగుబోతు పాత్రలు సృష్టించే హాస్యం చాలా ఇష్టం, ఇప్పటి వరకూ ఎంత మంది వేసినా ఈ పాత్రలో ప్రతిసారి ఏదో ఒక కొత్తదనం తీసుకు రావడంలో దర్శకులు సక్సెస్ అవుతూనే ఉంటారు. తెలుగు సినిమాల్లో ఎంఎస్ నారాయణ ఇప్పటివరకు ఇలాటి పాత్రల్లో రాణించేవారు, ఇపుడు ఇతను విపరీతంగా నవ్విస్తున్నాడు. ఊగిపోవడం తల ఊపడం అచ్చంగా అలానే అనుకరిస్తున్నాడు. ఇంత టాలెంట్ అండ్ అబ్సర్వేషన్ ఎక్కడిదయ్యా అని కాస్త వివరాలు కనుక్కుంటే తెలిసిన విషయం అతనిపై అభిమానం మరింత పెంచింది. తను చిన్నప్పుడు తన తండ్రి తాగివచ్చి అమ్మని కొట్టేవాడనీ ఆయన మళ్ళీ బయటకి వెళ్ళాక అమ్మని నవ్వించడానికి తన తండ్రిని అనుకరించి తాగుబోతులా నటించేవాడినని అలాగే అంత పర్ఫెక్ట్ మ్యానరిజమ్స్ అలవాటయ్యాయని చెప్పాడు. ఒక విషాదం నుండి వినోదాన్ని జీవనోపాధిని వెతుకున్న ఇతన్ని అభినందించాల్సిందే.. అతనికి ప్రోత్సాహాన్ని అందిస్తున్నవారిని కూడా అభినందించాలి.

ఇదివరకే జగడం, మహత్మ లాంటి ఒక పది సినిమాలు వరకూ నటించినా మహాత్మ లో కాస్త పేరు వచ్చింది తర్వాత ఈ సినిమాతోనే మళ్ళీ ఇంత పేరు తెచ్చుకున్నాడు. మహత్మ సినిమాలో కూడా ఎవడు మందు పోయిస్తే ఆ పార్టీవాడికి జైకొట్టే పాత్రలో జీవిస్తాడు ఆ సినిమాలో సైతం అతనున్న సీన్స్ లో ఫోకస్ అతని మీద లేకపోయినా నిజంగా తాగిన వ్యక్తి ఎలా ఐతే ఆ మొత్తం సన్నివేశానికి ఎలా రియక్ట్ అవుతాడో అలా తన పరిధిలో తను నటించేసి ఊగిపోతూ తమాషాగా తల ఊపుతూ చొక్కా చేతులు మడుస్తూ కొట్లటకు సిద్దపడుతూ ఆకట్టుకుంటాడు. ఇండస్ట్రీలో తాగుబోతు రమేష్, మహత్మా రమేష్ గా ఇప్పటికే పేరు తెచ్చుకున్న ఈ నటుడు మరిన్ని మంచి పాత్రలు చేసి వృద్దిలోకి రావాలని కోరుకుంటున్నాను.

5 కామెంట్‌లు:

కౌటిల్య చెప్పారు...

నాకు ఆ సినిమాలో సూపరుగా నచ్చిన సీను ఇది...బాగా చేస్తాడు...

"దొరికేశాం కదా! కుమ్మెయ్యండిక"....ః)

శుభకరుడు చెప్పారు...

హ హ అవును కౌటిల్య కనిపించినపుడల్లా నవ్వులు పూయించాడు. తాడు వెతుకుతూ పెళ్ళికొడుకుని నువ్వు పెళ్ళికొడుకువా ? అని అడిగి అతను అవునంటే వెటకారంగా ఒక నవ్వునవ్వి ఇక నీపెళ్ళి ఐనట్లే అంటాడు ఆ నవ్వు కేక ః}

శుభకరుడు చెప్పారు...

అన్నట్లు వ్యాఖ్యానించినందుకు మంగిడీలు కౌటిల్య ః)

సుమలత చెప్పారు...

దొరికేసాం కదా! కుమ్మెయ్యండిక....
అబ్బా ఈ డైలాగ్ సూపర్బ్
యిక ఈ సీన్ లో బాగా చేస్తాడు .

శుభకరుడు చెప్పారు...

సుమలత గారు మంగిడీలు ః) హ హ మనోడి లాస్ట్ డైలాగ్ "ఏక్ మినిట్.. అందరం దొరికినాంగదా .. ఇంకేంటి ప్రాబ్లం.. కుమ్మండి.." నిజంగా కేక ః)

నేనెవరినంటే!!

విశాఖపట్నం, India
పెద్దగా చెప్పుకోవడానికి ఏమీలేదు !!