ఆలోచనలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఆలోచనలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

22, ఫిబ్రవరి 2011, మంగళవారం

కసబ్ ను ఉరితీయద్దు

ఇది సెటైర్ కాదు సీరియస్ గా చెప్తున్నాను కసబ్ ను ఉరి తీయవద్దని భారత ప్రభుత్వానికి చెప్పండి, నేను కసబ్ ను శిక్షించద్దు అని అనడంలేదు ఉరితీయద్దు అని మాత్రమే అంటున్నాను. మానవతావాదం, కరుణ, ప్రాణం పోసేవాడికే తీసే హక్కులాంటి వాదనలు అన్ని పక్కన పెట్టి నేను చెప్పేది ఒక్కసారి ఆలోచించండి.

బహిరంగంగా ఉరితీయాలి కాల్చి చంపాలి అని వాదించే వాళ్ళంతా ఒకసారి ఆలోచించండి. ఏ శిక్షకైన పరమార్ధం ఏమిటి ఆ శిక్షకు బయపడి ఇతరులు అదేనేరం చేయకుండా ఆపడానికి, అతను చేసిన నేరానికి తగిన పరిహారం చెల్లించడానికి. కాని వాడు చేసిన మారణకాండకి ప్రతిగా రెండు నిముషాల్లో ప్రాణం పోయేలా ఉరి తియడం సమన్యాయమేనా ? ఆలోచించండి...

ఇటువంటి ఉద్యమంలో చేరినపుడే లెక్కచేయని వాడి ప్రాణాలు తీసి మనం సాధించేదేమిటి ? ఈ దేశంలో అడుగుపెట్టి అందరి ప్రాణాలతో చెలగాటమాడి ప్రాణాలతో తిరిగి వెళ్దామనే వాడీ దేశం వచ్చాడని మీరు నమ్ముతున్నారా ?? ఈ మిషన్ కి అంగీకరించినపుడే వాడు చావుకు సిద్దమై ఉంటాడు. అందుకే వాడు కోరుకున్న మరణాన్ని అంత సులువుగా అతనికి అందించకండి.

పూర్తి ఆరోగ్యవంతుడ్ని చేసి కట్టుదిట్టమైన బద్రత మధ్య జైల్లోనే ప్రత్యక్ష నరకం చూపిస్తూ చిత్రహింసలు పెట్టండి... బ్రతికి ఉన్న ప్రతి క్షణం ఇటువంటి పని చేసినందుకు పశ్చాత్తాపంతో కుమిలి పోతూ మరణం కోసం ఎదురు చూసేలా చేయండి... గల్ఫ్ దేశాలలో అమలు పరిచేలా ప్రాణం పోకుండా హింసకు గురిచేసే అమానవీయ శిక్షలు విధించి ఆ హింసలను వీడియో తీసి ఆ వీడియోలను ఇటువంటి రాక్షసులను తయారు చేసే దేశాలలో ప్రసారం చేయండి.

ఆ శిక్షలు ఎంత భయంకరంగా ఉండాలంటే ఈ దేశం మీద మరోసారి ఇలాంటి దాడి చేయాలన్న ఆలొచన రావడానికి కూడా అందరూ భయపడాలి. అంతే కానీ కేవలం మరణశిక్ష విధించడంవల్ల ఏ విధమైన ఉపయోగం ఉండదు అందుకే కసబ్ ను ఉరితియద్దు... వాడికి ప్రత్యక్షనరకం అంటే ఏమిటో రుచి చూపించండి.

నేనెవరినంటే!!

విశాఖపట్నం, India
పెద్దగా చెప్పుకోవడానికి ఏమీలేదు !!